హీరో గోపీచంద్ కు హిట్ వచ్చి 7సంవత్సరాలు దాటిపోతోంది. వరస ఫ్లాప్ లతో అతడి కెరియర్ పూర్తిగా దెబ్బతింది. అయినప్పటికీ  ధైర్యం చేసి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అధినేత బన్నీ వాసు గోపీచంద్ మారుతి ల కాంబినేషన్ లో సెట్ చేసిన ‘పక్కా లోకల్’ టైటిల్ తో పూర్తి కమర్షియల్ మూవీగా మారుతి మార్పు కామెడీతో ఈమూవీని పూర్తిచేసి చాలారోజులు అయింది.



అయితే సరైన రిలీజ్ డేట్ కోసం వేచిచూసి భారీ సినిమాల హంగామా అంతా పూర్తి అయిన తరువాత జూలై 1న ఈమూవీని విడుదల చేస్తున్నారు. ‘ప్రతిరోజు పండగే’ మూవీ తరువాత మారుతి ఆద్వర్యంలో వచ్చిన ‘మంచిరోజులు వచ్చాయి’ మూవీ విడుదలైనప్పటికీ ఆమూవీని ఎవరు పట్టించుకోలేదు. పెద్ద హీరోలతో సినిమాలు చేయాలి అన్నది మారుతి ధ్యేయం.



అయితే వెంకటేష్ తో అదేవిధంగా నాగచైతన్య తో గతంలో తీసిన సినిమాలు రెండు ఫెయిల్ అవ్వడంతో మారుతి పెద్ద హీరోల సినిమాల కలలు నెరవేరలేదు. దీనితో విధిలేక గోపీచంద్ తో సరిపెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘పక్కా లోకల్’ మూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో మారుతి ఆశలు బాగా పెరుగుతున్నాయి. అయితే టీజర్ చాల బాగుంది అని టాక్ తెచ్చుకున్న తరువాత అంచనాలతో విడుదలైన అనేక సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు యూత్ లో గోపీచంద్ కు పెద్ద క్రేజ్ లేదు.



కేవలం మారుతి మార్క్ కామెడీ పైనే ఈమూవీ నెట్టుకు రావాలి. ఈమూవీ విజయం సాధిస్తేనే మారుతి ప్రభాస్మూవీ ఫైనల్ అవుతుంది. ప్రభాస్ ను హీరోగా చేసి ఒక ఘోస్ట్ కామెడీ తీయాలని మారుతి ఇప్పటికే కథను రెడీ పెట్టుకున్నాడు. అయితే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ను ఇంకా హోల్డ్ లోనే పెట్టాడు. ఇలాంటి పరిస్థితులలో గోపీచంద్ కు మారుతి హిట్ ఇవ్వగలిగితే వెంటనే ప్రభాస్ ఆలోచనలు మారి మారుతిని మళ్ళీ తన దగ్గరకు పిలిపించుకునే అవకాశం ఉంది. దీనితో గోపీచంద్ మారుతి కి ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతాడో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: