సౌత్ ఇండస్ట్రీ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ లలో సమంత ఒకరు. సౌత్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కొని హీరోయిన్ గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సమంత 'ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2' వెబ్ సిరీస్ ద్వారా హిందీ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

ప్రస్తుతం సమంతకు బాలీవుడ్ నుండి అదిరిపోయే క్రేజీ ప్రాజెక్ట్ ల  అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా సమయాన్ని గడుపుతోంది.  ఇది ఇలా ఉంటే సమంత ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండటం వల్ల సమంత కు ఇన్ స్టా లో దాదాపు రెండు కోట్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. దానితో సమంత ఇన్ స్టా లో ఏ పోస్ట్ పెట్టినా ... ఈ పోస్ట్ ని షేర్ చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.  

అలాగే సమంత కు అభిమానులు కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో సమంత ఏ పోస్ట్ పెట్టినా అది  కూడా క్షణాల్లో అత్యధిక షేర్ లు అవుతూ ఉంటాయి.  ఇలా సమంత కు సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ ద్వారా ఈ ముద్దుగుమ్మ వీటి ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. సమంత ఇన్ స్టా లో ఒక్క పోస్ట్  పెడితే వాటికి కోట్లలో డబ్బులు వస్తాయి. ఇది ఇలా ఉంటే సమంత నెలకు ఇన్ స్టా లో పెట్టె పోస్ట్ ల ద్వారా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: