మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే. ఇటీవల ఈయన #RRR  సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం ఈయన వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.ఇదిలావుండగా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇకపోతే ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీకాంత్ , అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. 

 ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు.పోతే సినిమాకి  రకరకాల టైటిల్స్ వినపడ్డాయి.తాజాగా విశ్వంబర టైటిల్ ని ఓకే చేద్దామనుకున్నారు.... కానీ అది బాగా క్లాస్ గా ఉందని ఫీలయ్యారట. అంతకాక అలాగే సర్కారోడు, ఆఫీసర్ ఇలా చాలా టైటిల్స్ అనుకున్నారు.ఇకపోతే తాజా సమాచారం ప్రకారం.... ఫైనల్ గా...అధికారి అనే టైటిల్ దగ్గర ఆగిటనట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ ఈ టైటిల్ కే ఓటేసారట.ఇక  దాంతో టైటిల్ పవర్ఫుల్గా ఉండటంతో ప్రచారంలో ఉన్న 'అధికారి' పేరే ఖాయం చేద్దామని శంకర్ అన్నట్టు తెలుస్తోంది.అంతేకాదు త్వరలో ఈ టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని వినికిడి.

ఇదిలావుంటే  ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయనటంలో సందేహం లేదు. అయితే పాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది.ఇక  ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 150 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. కాగా 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమీషనర్ గా నటించనుండగటంతో పాటు, ఓ మాస్ పాత్రతో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.అంతకాక  రామ్ చరణ్ ఆ మధ్యన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు .ఆయన మాట్లాడుతూ "తెర మీద అయిన సినిమాలు చూసి ఇష్టపడతాం.ఇక ఇప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అంటూ చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: