సూపర్ స్టార్ రజినీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రజనీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కెరియర్ పరంగా రజనీ కాంత్ కు 169 సినిమా.  ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది. 

మూవీ కి సన్సేషనల్  మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరి పోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా రజనీ కాంత్ తదుపరి మూవీ కి సంబంధించిన టైటిల్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రజనీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు 'జైలర్'  అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఒక చైన్ కి కట్టి వేసిన ఒక పొడవాటి కత్తి , దానిపై నెత్తుటి మరకలు , దాని కింద జైలర్ అనే టైటిల్ ఉన్న పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని తెలుస్తోంది.

అలాగే ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించనున్నట్లు , అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించబోతోంది అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: