రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో అంతకుమించిన మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పటికే సాహో , రాధే శ్యామ్ వంటి రెండు భారీ పాన్ ఇండియా మూవీ ల ద్వారా ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ ,  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ , నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ లో కుగా నటించడానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.  ఇప్పటికే వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్, మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి , ప్రభాస్ తో తెరకెక్కించబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

దర్శకుడు మారుతి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రభాస్ మూవీ గురించి చర్చలు నడుస్తున్నాయి.  ప్రభాస్ కు నేను పెద్ద అభిమానిని.  ప్రభాస్ తో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ తీయాలని ఉంది. డార్లింగ్ , బుజ్జిగాడు లాంటి  యాక్టివ్ పాత్రలో ప్రభాస్ ను చూపించాలి అనేది నా కోరిక.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చెయ్యను అని తాజా ఇంటర్వ్యూలో మారుతి చెప్పుకొచ్చాడు. ఇలా తాజా ఇంటర్వ్యూలో మారుతి చెప్పిన మాటలతో ప్రభాస్ అభిమానులు మారుతి , ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై అంచనాలు పెంచుకొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: