లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా, ఈ మూవీ లో ఫహాద్ ఫాజిల్ , విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలలో నటించగా ,  సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు . ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు .  

సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది .  భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన విక్రమ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది . ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకెళుతోంది .  ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కమల్ హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు కారును బహుమతిగా ఇచ్చాడు . అలాగే ఈ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య కు రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు . అలాగే ఈ సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు బైక్ లను గిఫ్ట్ లుగా ఇచ్చాడు .

ఇలా ఈ సినిమాకు పని చేసిన చాలా మందికి గిఫ్ట్లను ఇచ్చిన కమల్ హాసన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచంద్రన్ కు మాత్రం ఎలాంటి గిఫ్టు ఇవ్వలేదు. అయితే తాజాగా కమల్ హాసన్ నుండి తనకు గిఫ్టు రాకపోవడంపై అనిరుద్ ఓ ఇంటర్వ్యూ స్పందించాడు. అనిరుధ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  కమల్ హాసన్ మూవీ కి పని చేయడమే పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: