సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అయితే రిపీటెడ్ గా ఏ కొద్ది మంది డైరెక్టర్ ల దగ్గర నుండి మాత్రమే సినిమాలు వస్తూ ఉండేవి. కానీ రాను రాను కాలం పూర్తిగా మారిపోయింది. కొత్త కొత్త డైరెక్టర్ లు తమ టాలెంట్ తో సీనియర్ డైరెక్టర్లకు ధీటుగా సినిమాలు తీస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. అలా కేవలం రెండు సినిమాలకే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అతి కొద్ది మంది డైరెక్టర్ లలో తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒకరని చెప్పాలి. ఈయన తన కెరీర్ లో మొదటగా కోలమవు కోకిల మరియు డాక్టర్ చిత్రాలతో వరుసగా హిట్ లను తన ఖాతాలో వేసుకుని తమిళ ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించాడు. దీనితో ఒక్కసారిగా నెల్సన్ కు విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. అలా ఈ సంవత్సరం బీస్ట్ అనే సినిమా విడుదల అయింది.

ఇందులో విజయ్ మరియు పూజ హెగ్డే లు హీరో హీరోయిన్ లుగా నటించారు.. ఇక డైరెక్టర్ శ్రీరాఘవ కూడా ఇందులో కీలక పాత్ర చేసి అలరించారు. ఈ సినిమా అంతగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందనను తెచ్చుకోవడంలో ఫెయిల్ అయింది. కానీ మ్యూజికల్ గా మాత్రం హిట్ అయింది. అయితే ఇప్పుడు తలైవా రజినీకాంత్ ను ఇతడు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా పోస్టర్ కూడా తాజాగా రిలీజ్ అయింది. సినిమాకు జైలర్ ను టైటిల్ ను ఖరారు చేశారు. బీస్ట్ లాంటి సినిమా తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో నెల్సన్ దిలీప్ కుమార్ మెడకు కత్తి వేలాడుతున్నట్లు ఉంది. ఇది రజినికాంత్ కెరీర్ లో 169 వ చిత్రం కావడం విశేషం.  

సినిమా మీదనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇటు రజినీకాంత్ కూడా అన్నాత్తే హిట్ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ లాంటి ప్లాప్ తర్వాత రజినీకాంత్ కు మరో హిట్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బీస్ట్ లాంటి సినిమా తర్వాత కూడా నెల్సన్ మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ కు రజినీకాంత్ పచ్చజెండా ఊపాడు. మరి ఆ నమ్మకాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ నిలబెట్టుకుంటాడా ?

మరింత సమాచారం తెలుసుకోండి: