సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.అంతేకాదు ఆయన తెలియని సినీప్రేక్షకుడు ఉండడు.అయితే ఈయన  పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా జపాన్ లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ఉంది.అయితే  కొంత కాలంగా సినిమాల విషయంలో అభిమానులను అప్సెట్ చేస్తూ వస్తున్నారు ఈయన.ఇదిలావుండగా తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో రజినీ తన నెక్ట్స్ సినిమాను ప్రకటించడంతో.. అభిమానుల ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.కాగా డాక్టర్, బీస్ట్ వంటి చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను అలరించిన నెల్సన్..

 ప్రస్తుతం ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.ఇకపోతే  గతంలోనే సినిమాను ప్రకటించిన మేకర్స్ తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేశారు.అయితే  'తలైవా169'గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి 'జైలర్'(Jailer) అనే టైటిల్ ఖరారు చేశారు.కాగా  రజినీ క్రేజ్ కు తగ్గట్టుగానే టైటిల్ చాలా మాస్ గా ఉంది.ఇకపోతే  ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు దాదాపు సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నా టైటిల్స్ ను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఇక్క్ ఈ తరుణంలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ రాబోయే చిత్రం టైటిల్ ను త్వరగా ప్రకటించడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలావుండగా మరోవైపు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూ అద్భుతమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ పోస్టర్స్ లో రక్తపు మరకలతో వేళాడదీసిన ఓ కత్తి కనిపిస్తోంది.కాగా  బ్యాక్ డ్రాప్ లో ఏదోక ఫ్యాక్టరీ లోకేషన్ ను చూడవచ్చు.ఇదిలావుంటే  ఈ చిత్రానికి రజినీకాంతే స్వయంగా కథ రాస్తున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది.అంతేకాదు  తొలిసారిగా తన సినిమాకు తానే పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడని సినీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. పోతే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌, రమ్య కృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్‌, శివ రాజ్‌ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ కనువిందు చేయబోతున్నారు.కాగా  ప్రస్తుతం ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే  సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: