దేవి శ్రీ ప్రసాద్ ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద సినిమా వస్తుంది అంటే దేవి శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడుగా ఉండాలి అన్నట్టు దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు కోరుకునేవారట..


అయితే ఇప్పుడు పరిస్థితి అయితే మారింది. 'మహర్షి' చిత్రం నుండీ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే పెద్ద సినిమాల మేకర్స్ కూడా భయపడుతున్నారు. అతని పాటల పై కూడా భయంకరమైన ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇదే గ్యాప్ ల్లో తమన్ స్థాయి కూడా పెరిగింది.


'అల వైకుంఠపురములో' చిత్రం పాటలతో… 'సరిలేరు నీకెవ్వరు' కి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ పై పై చేయి సాధించాడు థమన్. దాంతో పెద్ద సినిమాలకు వరుసగా తమన్ నే ఎంపిక చేసుకునేలా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ మిడ్ రేంజ్ సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.ఈ మధ్య కాలంలో ఒక్క 'పుష్ప' అనే పెద్ద చిత్రానికి మాత్రమే దేవి శ్రీ ప్రసాద్ పనిచేశాడు.


 


అందులో పాటలు హిట్ అయినా కానీ అది సుకుమార్ క్రెడిట్ అంటూ నెగిటివ్ కామెంట్లు చేసిన బ్యాచ్ కూడా లేకపోలేదు. ఇక అసలు మేటర్ కు వచ్చేస్తే.. పవన్ - హరీష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భవదీయుడు భగత్ సింగ్' కి దేవి శ్రీ ప్రసాద్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కానీ 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' లకి తమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి అతన్నే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతలకి చెప్పారట.


 


దీంతో దేవి శ్రీ ని పక్కన పెడదామా అని పవన్ ను అడిగారట దర్శకనిర్మాతలు. అందుకు పవన్.. 'వద్దు దేవి శ్రీ నే ఉండనివ్వండి' అంటూ తేల్చి చెప్పేశాడట పవన్. పవన్ సినిమాలకి దేవి మంచి ఔట్పుట్ ఇస్తాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్లాప్ అయినా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ  కూడా తెగ ప్లే అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: