ట్రెండ్ కు తగ్గట్టుగా మారుతూ ఉండే డైరెక్టర్లలో డైరెక్టర్ మారుతి ఒకరని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న న ప్రభాస్ డైరెక్టర్ మారుతి అవకాశం ఇవ్వడమెంటి అన్నట్లుగా కామెంట్ చేశారు. అయితే పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న మారుతి ప్రభాస్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ప్రభాస్ తో సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి ప్రభాస్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక సినిమా తీయాలని తన కోరిక అని తెలియజేశారు.


ప్రభాస్ నటించిన డార్లింగ్, బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ ఎంత యాక్టివ్ గా కనిపించారు తాను ప్రభాస్ ను అలాగే చూపించాలి అనుకుంటున్నారు మారుతి తెలిపారు తాను వ్యక్తిగతంగా ప్రభాస్ అభిమానిని మారుతి కామెంట్లు చేయడం జరిగింది. ఫ్యాన్స్ ఉత్సాహపరిచే విధంగా తన సినిమా ఉండబోతోందని చెప్పకనే తెలియజేశారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాకు సంబంధించి హీరోయిన్ లు ఇతర విషయాలకు సంబంధించి పలు కథనాలు కూడా ఎక్కువగా ప్రచారంలో వినిపిస్తునాయి.ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు మారుతి.

పక్కా కమర్షియల్ సినిమా గురించి డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా ఈ సినిమా ఉంటుందని కామెంట్స్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ లను దృష్టిలో పెట్టుకొని తాను ఈ సినిమాను తెరకెక్కించానని ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధే శ్యామ్ వంటి చిత్రాలు తీవ్రస్థాయిలో నిరాశపరిచాయని అందరికీ తెలిసిందే.. భవిష్యత్తు లో చేస్తున్న ప్రాజెక్టులు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ ఒక చిత్రానికి రూ.75 కోట్ల రూపాయల నుండి రూ.150 కోర్టులో అనుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండడంతో ఈ స్థాయి వ్యాసం అందుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: