టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో హాస్యనటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సప్తగిరి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఈ క్రమంలోనే సప్తగిరి ఎల్.ఎల్.బి , వజ్ర కవచ ధర గోవిందా, గూడుపుఠాని వంటి సినిమాలలో హీరోగా నటించాడు సప్తగిరి. హీరోగా మాత్రమే చేస్తానని పట్టుబడకుండా ఒకవైపు అవకాశం వచ్చిన చోట కమెడియన్ గా చేస్తూనే, మరొకవైపు మంచి కథలు వచ్చినప్పుడు లీడ్ క్యారెక్టర్ లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.


ఇప్పుడు సరికొత్తగా అన్ స్టాపబుల్ అనే సినిమాతో మళ్ళీ హీరోగా అలరించడానికి సిద్ధమవుతున్నారు సప్తగిరి. అన్ స్టాపబుల్ సినిమాకి నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ విజేత వీ జే సన్నీ ఇందులో మరో హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. దర్శకుడి విషయానికి వస్తే సన్ ఆఫ్ ఇండియా ఫేమ్ డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సప్తగిరి మంచి టాలెంట్ ఉన్న నటుడు అని అందరికీ విధితమే. ఇక అతని కామెడీ టైమింగ్ కి  ప్రేక్షకులు కూడా ఫిదా అవుతూ ఉంటారు.

ఇక మంచి స్క్రిప్టు దొరికితే సరైన దర్శకుడి చేతిలో పడితే సప్తగిరి కచ్చితంగా మరో విజయాన్ని తన సొంతం చేసుకుంటాడు అని అభిమానులు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని అన్ స్టాపబుల్ సినిమా హీరో గా సప్తగిరి కి ఎలాంటి విజయం అందుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను  ఎ 2 బి ఇండియన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  రంజిత్ రావు నిర్మిస్తున్నారు . దసరాకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం వుంది. ఇక ఇందులో బిత్తిరి సత్తి,  మనిచందన , పృద్వి,  చమ్మక్ చంద్ర,  శకలక శంకర్,  గబ్బర్ సింగ్ బ్యాచ్ మరికొంతమంది ఈ పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: