కమల్ హాసన్ ఖాతాలో ఇటీవల ఓ భారీ హిట్ పడింది..లోకేష్ కనకరాజు, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా విక్రమ్..ఈ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత కమల్ నటించిన సినిమా ఈ ఏడాదిలో తమిళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా వివాదంపై స్పందించాడు..


 విక్రమ్ సినిమా విజయోత్సవంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ పలు ఆసక్తికర విషయాలను మీడియా తో పంచుకున్నారు..డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తాను ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం భారతీయుడు 2.. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ పలు కారణాల వలన తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోయింది.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఇందుకోసం చిత్రయూనిట్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 షూటింగ్ కంప్లీట్ కాగానే.. భారతీయుడు 2 మూవీ పట్టాలెక్కుతుంది అంటూ చెప్పుకొచ్చారు.



వీరిద్దరు కలిసి 1996లో వచ్చిన సంచలన చిత్రం భారతీయుడు సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సిక్వెల్ గా భారతీయుడు 2 మూవీ తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించనప్పిటి నుంచి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 2020లో సెట్లో అనుకోకుండా ప్రమాదం జరిగి కొందరు ప్రాణాలు కోల్పోవడం.. ఆ తర్వాత దర్శకనిర్మాతల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ సినిమా ఆగిపోయింది.ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెల్లాడు..అసలు భారతీయుడు 2 సినిమా ఉంటుందా ? లేదా ? అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: