ఏ విషయాన్నైన ముక్కు సూటిగా మాట్లాడతారు రామ్ గోపాల్ వర్మ.అయితే ఈయన  ప్రతి విషయాన్ని చాలా చక్కగా విశ్లేషించి మాట్లాడుతుంటారు.ఇకపోతే మరి కొద్ది రోజులలో వర్మ తెరకెక్కించిన కొండా చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూ వస్తున్నారు.ఇక తాజాగా ఆయన సినిమా టిక్కెట్స్ విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా ఏపీలో టికెట్స్ ధరలు తగ్గిస్తూ విడుదల చేసిన జీవోపై పెద్ద చర్చే నడిచింది. అయితే తెలంగాణాలో అంతకు ముందే భారీగా టికెట్స్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కాగా అక్కడ టికెట్ ధర అత్యధికంగా మల్టీప్లెక్స్ లలో రూ. 350 వరకు ఉంది. ఇకపోతే పెద్ద చిత్రాల విడుదల సమయంలో మరో వంద రూపాయలు పెంచి అమ్ముకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు.కాగా  ఈ క్రమంలో అధికారికంగానే సినిమా టికెట్ ధర బ్లాక్ టికెట్ ధరను దాటేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా థియేటర్ లో చూడాలంటే టికెట్ కి రూ. 500 వెచ్చించాల్సిన పరిస్థితి.అంతేకాక ఈ పరిణామం తీవ్ర ప్రతికూలతలకు దారి తీసింది. ఇకపోతే టికెట్స్ ధరలకు భయపడి ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మానేశారు. ఓ నెల రోజుల తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనే భావనకు వచ్చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో నిర్మాతలు కూడా ఓ మెట్టు దిగారు.

పోతే ఎఫ్ 3 చిత్రానికి నిర్ణయించిన ధరలకే టికెట్స్ అమ్ముతామని దిల్ రాజు ప్రకటించారు. తాజాగా విరాటపర్వం చిత్రానికైతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కూడా తగ్గించి విక్రయిస్తున్నారు.ఇదిలావుండగా తాజాగా ఒక  ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ ఇదే విషయంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ....టికెట్స్ ధరల పెంపు కోసం పోరాడిన మేమంతా జోకర్లమని ఆయన అన్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్ అని రుజువైంది. ఇక ప్రేక్షకుల స్తోమతకు మించి ధరలు పెంచితే థియేటర్స్ లో సినిమాలు ఎవరూ చూడరని తెలిసొచ్చింది. అయితే ఏదో జరిగిపోతుందని అప్పుడు మేము రాద్ధాంతం చేశాం. పోతే వాస్తవాలు తెలిశాక మేము చేసిన తప్పు తెలిసిందన్న అభిప్రాయం వర్మవెలువరించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV