టాలీవుడ్ క్రేజీ హీరోలలో ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉన్న హీరో నాని. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతో అలరించే ఈ హీరో గత కొన్ని సినిమాలుగా హిట్ లు అందుకోలేకపోతున్నాడు. ఒకే తరహా లో సినిమాలు చేయడం, ఒకే తరహా పాత్రలు చేయడం వంటివి జరగడంతో ఆయనను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు. కొత్తదనాన్ని కోరుకుంటున్నామని ప్రేక్షకులు ఎంత చెప్తున్నా కూడా నాని చేసిన పాత్రలే చేస్తూ ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నాడు.

అలా ఇటీవలే అయన హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా విడుదల కాగా అది కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయి లో మెప్పించలేకపోయింది. ఈ సినిమా లో నాని పాత్ర ఎంతో వెరైటీ గా ఉంటుంది అని అందరు అనుకున్నారు కానీ అయన గత సినిమాల్లోని పాత్రల మాదిరిగానే ఈ సినిమా ఉండడంతో మరొక ఫ్లాప్ అయన ఖాతాలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆయన అభిమానుల ఆశలన్నీ కూడా రాబోయే దసరా సినిమాపైనే ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ పుష్ప సినిమా ను పోలి ఉంది అని విమర్శలు రావడంతో ఆదిలోనే ఈ సినిమా కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. వాస్తవానికి ఈ టీజర్ ను బట్టి నాని కనిపించిన రగ్డ్ లుక్ ను బట్టి పుష్ప లోని అల్లు అర్జున్ పాత్రనే పోలి ఉంది. ఈ నేపథ్యంలో కథలో కొత్తడం ఉంటే తప్పా సినిమా హిట్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు. నటనలో ఎలాంటి వంక పెట్టకపోయినా నాని సినిమాల ఎంపిక మాత్రం ఈమధ బాగుండడం లేదన్నది ఆయన అభిమానుల నుంచి కూడా వస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలో ఆయనకు దసరా సినిమా ఏ స్థాయి లో విజయాన్ని తెచ్చి ఆయన కెరీర్ ను కాపాడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: