పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్రీ లీల. తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ మేకర్స్ ను కూడా ఎంతగానో ఆకర్షించింది. అప్పటినుంచి ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద హీరోలు సైతం ఈ ముద్దుగుమ్మ కోసం పోటీ పడుతూ ఉండటం విశేషం. త్వరలోనే ఈమె టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా ఎదగడం ఖాయమని వారు భావిస్తున్నారు. 

ప్రస్తుతం రవితేజ ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈమె ఆ తరువాత మరికొంత మంది యువ హీరోల సినిమాల లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రెండో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా తొలి హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ విధంగా రెండో హీరోయిన్ గా సినిమా చేయడంపై ఆమె అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె పాత్ర బాగా ఉండటంతోనే ఈ రెండవ హీరోయిన్ పాత్రకు ఒప్పుకోవడానికి సిద్ధమైందని ఓవైపు వార్తలు వినిపిస్తున్న కూడా ఇంకొక వైపు మాత్రం ఈ విధంగా ఈ పాత్రను చేయడం ఆమె కెరీర్ కు చాలా పెద్ద మైనస్ అని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఒప్పుకుంటున్న సినిమాలు సైతం చిన్నవి గా ఉండడంతో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఆమె రాంగ్ రూట్ లో వెళ్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇలానే చేస్తే త్వరగానే కెరియర్ ముగిసిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈమె మంచి సినిమాలను ఎంపిక చేసుకొని ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: