తెలుగు లో సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె ఏ హీరో సినిమాలో నటించిన ఆమెకోసమే సినిమాలకు వెళ్లే అభిమానులు ఉన్నారంటే నమ్మాల్సిందే. అలా హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాట పర్వం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రానా హీరో గా నటించిన ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఓ విప్లవ ప్రేమకథగా ఈ సినిమా రావడం అందరిలో ఆసక్తి ని కలుగ జేస్తుంది.

 ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే సినిమాపై అంచనాలు పెరిగి హిట్ అయ్యింది. ఈ సినిమా లో సాయి పల్లవి పాత్ర ఏ స్థాయి లో ఉందొ ట్రైలర్ ను బట్టి అర్థమఅయ్యింది. సినిమాలో కూడా అద్భుతంగా ఉంది. రానా పాత్ర కూడా వేరే లెవెల్లో ఉంటుందని ట్రైలర్ లో చక్కగా చూపించారు. సినిమాలో కూడా అలాగే ఉంది. అలా అందరిలో ఎంతో ఆసక్తికరమైన సినిమా గా మారిపోయింది ఇది. అయితే ఆమెకున్న క్రేజ్ ను గమనించిన చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం ఆమెనే ఎక్కువగా ప్రమోషన్ కి ఉపయోగించుకోవడం జరిగింది.. ఏ సినిమాకైనా హీరో నే సెంటర్ అఫ్ ది అట్రాక్షన్ అవుతాడు కానీ సాయి పల్లవి నటించే సినిమాలకు ఆలా కాదు.

హీరో తో పాటు ఆమె కూడా సెంటర్ అఫ్ ది అట్రాక్షన్ అవుతుంది. కొన్ని సార్లు హీరో కంటే ఎక్కువగా ఆమె ఎక్కువ హైలైట్ అవుతుంది. అలా ఇప్పుడు విరాటపర్వం సినిమా లో ఆమె మెయిన్ సెంటర్ అఫ్ ది అట్రాక్షన్ అయిపొయింది. రానా ప్రమోషన్స్ కి రాకపోయినా సినిమా కి బజ్ వచ్చేసింది అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అందరు సాయి పల్లవి గురించి మాట్లాడం ఆమెకున్న మార్కెట్, క్రేజ్ గురించి తెలియజేస్తుంది. మరి ఎన్నో అంచనాలు మరెన్నో ఆశలు పెట్టుకుని ఆమె చేసిన ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడం నిజంగా అందరి కృషి అనే చెప్పాలి. ఫ్యూచర్ లో సాయి పల్లవి ఎలాంటి పాత్రలతో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: