టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించిన విషయం మన మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నజ్రియా కథానాయికగా నటించింది . ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.

సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు, పాటలకు, టీజర్ కు , ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అంటే సుందరానికి  సినిమాకి దాదాపు 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇలా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న అంటే సుందరానికి మూవీ 31 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న అంటే సుందరానికి మూవీ కి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు వచ్చాయి. అలాగే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ కూడా లభించింది.  

దానితో ఈ సినిమా మొదటి వారం రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న అంటే సుందరానికి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 18.56 కోట్ల షేర్ ను , 32.93 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. అంటే సుందరానికి మూవీ ప్రపంచ వ్యాప్తం గా క్లీన్ గా నిలవాలంటే ఇంకా 12.44 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: