గతంలో ఫ్యాన్స్ వార్ అంటే ఫేస్ టు ఫేస్ ఉండేది. సినిమా థియేటర్ ల వద్ద ఇరు హీరోల అభిమానులు వార్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు ఫ్యాన్ వార్ అంటే ట్విట్టర్ లోనే జరుగుతుంది. ట్విట్టర్ వేదికగా ఇద్దరు హీరోల అభిమానులు భారీ స్థాయిలో వాగ్వాదం చేసుకుంటూ ఉంటారు. ఒకరిపై ఒకరు ట్రెండ్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక హీరో సినిమా విడుదలైతే ఇతర హీరోల అభిమానులు ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది నీచమైన పద్ధతి.

తద్వారా ఆ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు చూడకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దాంతో ఆ సినిమాకు కలెక్షన్లు పెద్దగా రావు. అయితే ఇక్కడ ఇదే అసలు సమస్య అయింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా చేస్తే చివర్లో ఈ విధంగా అభిమానుల చర్యల వల్ల మంచి కలెక్షన్లు రాకపోవడం సదరు నిర్మాతను ఎంతగానో ఇబ్బంది పెడుతుది. భారీ స్థాయిలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలంటే భారీ కలెక్షన్లు కూడా రావాల్సి ఉంటుంది. పాన్ ఇండియా సినిమా చేసే రోజులలో ఇలాంటి ఫ్యాన్ వార్స్ జరగడం అందరిని మరింత ఆశ్చర్యపరుస్తుంది. 

అంతే కాదు ఎవరైనా ఒక కొత్త హీరో ఎదుగుతున్నాడు అంటే అతనిని కూడా ట్రోల్ చేసేందుకు ఇతర పెద్ద హీరోల అభిమానులు సాయశక్తులా పనిచేస్తున్నారు. తమ హీరోనే గొప్ప అనే ఉద్దేశం ఉంటే పరవాలేదు కానీ తమ హీరో మాత్రమే ఎదగాలి అని అనుకునే ఉద్దేశం ఉండడం ఎంతవరకు సినిమా పరిశ్రమకు మంచిదో వారే అర్థం చేసుకోవాలి. కొత్త నటీనటులు ఇండస్ట్రీకి రావడమే సినిమా పరిశ్రమ యొక్క అభివృద్ధి. ఇలాంటి అభివృద్ధిని అభిమానులు స్వాగతించాలి కానీ ఈ విధంగా అడ్డుకోవడం సినిమా పరిశ్రమకు తీరని నష్టం వస్తుంది. ఇటీవలే విడుదలైన సర్కార్ వారి పాట సినిమా పర్వాలేదనిపించుకునే స్థాయిలో ఉన్నా దాన్ని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఫ్లాప్ గా చిత్రీకరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: