పండుగ సందర్భంగా విడుదలయ్యే ఇద్దరు హీరోలు నటించే ఏ సినిమాకైనా మంచి పోటీతత్వం నెలకొని ఉంటుంది.  ముఖ్యం గా స్టార్ హీరోల మధ్య గట్టి పోటీనే నెలకొని ఉంటుంది. గతంలో చాలా సార్లు పెద్ద హీరోల సినిమాలు పండగ సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆహ్లాదకరమై న పోటీ ఆరోగ్యకరమైన పోటీ ఉండటంతో అభిమానులు కూడా ఆ సినిమా కూడా చూసి మంచి వసూలు వచ్చేలా చేసేవారు. ఆ విధంగా ఇప్పుడు మరొకసారి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు

మెగాస్టార్ చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరూ కూడా తమ సినిమాలతో ఈ దసరాకు ప్రేక్షకులను అలరించబోతున్నారు అ ని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ముందుగా గాడ్ ఫాదర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో ఈ సినిమా మొదలైన కూడా ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఇదే సమయంలో పూర్తి చేస్తూన్నారు. దసరా కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది

ఆ విధంగా చిరంజీవి దసరా కు ప్రేక్షకుల ముందుకు రావాలని భావించగా ఆయనకు పోటీగా బాలకృష్ణ కూడా తన సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన చేస్తున్న మాస్ మసాలా చిత్రం దసరాకు విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాలను ఆందుకుంటాయో అన్న ఆసక్తి నెలకొంది. గతంలో కూడా ఇద్దరు చాలా సార్లు పండుగ సమయాలలో పోటీపడగా ఇద్దరు కూడా అభిమానులను ఎంతో అలరించారు.  ఈ సారి వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: