లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో సూర్య గెస్ట్ రోల్ లో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే. విక్రమ్ మూవీ జూన్ 3 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు,  కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది.

మూవీ విడుదల అయిన మొదటి షో నుండే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. అందులో భాగంగా విక్రమ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలిచింది.  విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్... ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం ద్వారా విక్రమ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన విక్రమ్ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.75 కోట్ల షేర్ ను , 25.71 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన విక్రమ్ సినిమా ఇప్పటికే 7.25 కోట్ల లాభాలను అందుకొని , రెండు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికి కూడా విక్రమ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: