టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం  మన  అందరికీ తెలిసిందే .

ఈ సినిమాలో అక్కినేని అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది . ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది . ఈ సినిమా లో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ మూవీ ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది .  కాకపోతే చిత్ర బృందం ప్రకటించిన విడుదల తేదీ దగ్గర పడటంతో , ఈ సినిమా పనులు చాలా వరకు పెండింగ్ లో ఉండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది .

అయితే ఆగస్ట్ 12 వ తేదీన ఈ సినిమా విడుదలను వాయిదా వేసి దసరా సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన లేదా 6 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేయలేదు . ఇది ఇలా ఉంటే ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న అఖిల్ 'ఏజెంట్' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: