యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు .  ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు .

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా చిత్ర బృందం ప్రకటించింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఆచార్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ ను ఎదుర్కొన్న కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో తెరకెక్కించ బోయే సినిమా కథ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది . ఇదిలా ఉంటే కొరటాల శివ, ఎన్టీఆర్ తో అదిరిపోయే మాస్ యాక్షన్ సినిమాను తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే మాస్ యాక్షన్ సినిమా స్క్రిప్ట్ పై కొరటాల శివ మరింత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇది వరకే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు .

ఆ అంచనాలను అందుకునేలా సినిమాను రూపొందించడం కోసం కొరటాల శివ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయబోతున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: