ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు వరుససినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా కొంత మంది సీనియర్ స్టార్ హీరోలు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాలో లైన్ లో పెడితే దూసుకుపోతున్నారు. అలాగే కొంత మంది సీనియర్ స్టార్ హీరోలు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్లి ఫుల్ జోష్ ను చూపిస్తున్నారు.  అందులో భాగంగా ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ఏ హీరోయిన్లతో నటిస్తున్నారు తెలుసుకుందాం.

చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లి ఫుల్ బిజీగా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం  గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలలో భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా,  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది.


బాలకృష్ణ : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.


నాగార్జున : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు ఆయన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
వెంకటేష్ : విక్టరీ వెంకటేష్ తాజాగా ఎఫ్ 3 మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: