బోయపాటి శ్రీను అఖండ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు . అయితే ప్రస్తుతం రామ్ లింగుసామి డైరక్షన్ లో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.ఇకపోతే ఆ సినిమా పూర్తి కాగానే బోయపాటి మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. కాగా రామ్ తో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమాలో బాలయ్య బాబు కూడా ఉంటాడని తెలుస్తుంది. అయితే అదేంటి బోయపాటి శ్రీను మల్టీస్టారర్ ఏదైనా చేస్తున్నాడా లేక రామ్ సినిమాలో బాలయ్య కెమియో ఉంటుందా అంటే సినిమాలో బాలకృష్ణ ఉండడు కాని ఆయన రిఫరెన్స్ మాత్రం ఉంటుందని అంటున్నారు.

ఇకపోతే రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాలో జై బాలయ్య అనే రిఫరెన్స్ వాడుతున్నారని తెలుస్తుంది. కాగా బోయపాటి తన సినిమాలో బాలయ్య రిఫరెన్స్ వాడి నందమూరి ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు. అంతేకాక రామ్ ది వారియర్ సినిమా ఆల్రెడీ పూర్తి చేసుకుంది త్వరలోనే బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.కాగా  బోయపాటి మార్క్ యాక్షన్ మూవీగా రామ్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇకపోతే  ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఇక ఈ సినిమాపై రామ్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో చేస్తున్న ది వారియర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాలో రామ్ జోడిగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.ఇక సినిమాలో రామ్ మొదటి సారి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: