ఎప్పటికప్పుడు సినీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. దూసుకుపోతోంది ఓ టి టి దిగ్గజ సంస్థ అహ. ఇందులో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు కూడా విడుదలవుతున్నాయి. ఇక అంతే కాకుండా పలు కార్యక్రమాలు కూడా ఈ షోలో ప్రసారం కావడం వల్ల ఈ ఓ టి టీ బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా ఆహా మరొక థ్రిల్లింగ్ హర్రర్ జోనర్ సిరీస్ ను తీసుకు రాబోతోంది. ఇక ఇందులో రెజీనా, నివేదిత సతీష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కి టైటిల్గా ఆన్యస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు.


ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్ ఆర్కె మీడియా నిర్మించారు ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు ఇతర భాషల విడుదల చేయనున్నారు. తాజాగా ఇటీవల ఈ వెబ్ సిరీస్ టీజర్ ను కూడా పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ ను  హైదరాబాదులో చాలా గ్రాండ్గా నిర్వహించారు.


ఇక ఈవెంట్స్ కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ని ముఖ్యఅతిథిగా తీసుకు రావడం జరిగింది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉన్నది. రెజీనా నివేదిత సతీష్ తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే లా కనిపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్క అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. మరి  కొన్ని రోజుల క్రితం రెజీనా పలు ఐటమ్సాంగుల తో పాటు హీరోయిన్ గా నటించిన కూడా పెద్దగా కలిసి రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటించడంతో ఇమే కెరీర్కు ప్లస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: