టాలీవుడ్ లో ఇప్పుడు అంతా యంగ్ హీరోల రాజ్యమే నడుస్తోంది. సినీ నేపథ్యంతో సంబంధం లేకుండా వచ్చి తమ నటనతో పాతుకుపోతున్నారు. అయితే ఇలాంటి ఎంతోమంది నటీనటులు సినిమా మీద ఉన్న ఫాషన్ తో చిత్రపురి వస్తున్నారు. తాము అంతకు ముందు ఏ పని చేస్తున్నా దానిని అక్కడిక్కక్కడే వదిలేసి మరీ తమకు ఎంతో ఇస్టమైన నటనా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. కాగా గత కొంతకాలంగా ఒక యంగ్ హీరో పేరు మాత్రం తెగ వినబడుతోంది. కేవలం ఒకటి రెండు సినిమాలకే తాను ఒక రేంజ్ కు చేరిపోయాడు. అతను మరెవరో కాదు రాజావారు రాణిగారు సినిమాతో తన నటనను స్టార్ట్ చేసిన కుర్ర హీరో కిరణ్ అబ్బవరం.

మొదటి సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వక పోయినా నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇతనిలో టాలెంట్ గమనించిన టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తనను హక్కును చేర్చుకుంది. తద్వారా వరుస సినిమాలు ఇతనికి ఆఫర్ లుగా వచ్చి పడ్డాయి. రెండవ సినిమాగా ఎస్ ఆర్ కల్యాణమండపం వచ్చింది. ఈ సినిమా అటు కథ పరంగా మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది. దీనితో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అయితే ఇంతలా దూసుకుపోతున్న ఈ కుర్రాడు సినిమా పరిశ్రమకు ఎలా వచ్చాడు అని ఎందరో అనుకుంటూ ఉండవచ్చు.

కిరణ్ అబ్బవరం ముందుగా ఒక ప్రముఖ కంపెనీలో ఇంజనీర్ గా పని చేశాడట. అప్పుడు ఇతనికి నెలకు 70 వేలకు పైగానే వచ్చేదట. అయితే సినిమాల పై తనకు ఉన్న ఆసక్తితో తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగం లోకి వచ్చేశాడు. మరి సక్సెస్ అవుతాడో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.  ఇతని లాగే ఇంకా కొందరు కూడా సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ లాగా చేస్తూ టాలీవుడ్ ని నమ్ముకుని వచ్చారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: