మెగాస్టార్ చిరంజీవి అనేక సందర్భాలలో ఆయనకు సంబంధించిన అనేక సినిమా విషయాలను ఆయనకు తెలియకుండానే లీక్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఒకానొక సినిమా వేడుకలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాను అని ప్రకటించాడు. అప్పటి వరకు సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.

అయితే ఈ మధ్యనే బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య సినిమాలో నటిస్తున్నారు అని ప్రకటించాడు. ఈ సినిమాకు ఇప్పటి వరకు కూడా అధికారికంగా వాల్తేరు వీరయ్య అనే సినిమా పేరును చిత్రబృందం అనౌన్స్ చేయలేదు. ఇలా చిరంజీవి తనకు సంబంధించిన సినిమా విషయాలను సినిమా ఫంక్షన్ లలో, ఇతర సందర్భాలలో తనకు తెలియకుండానే లీక్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ సినిమాకు మ్యూజిక్ ను అందిస్తున్న తమన్ లీక్ చేశాడు. ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయిన ఆహ లో తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫైనల్ తాజాగా జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఫైనల్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.  

తెలుగు ఇండియన్ ఐడియల్ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్ , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలిగా నయనతార  నటిస్తుందని, వారిద్దరి మధ్య ఓ పాట కూడా ఉంటుందని , ఆ పాటని తెలుగు  ఇండియన్ ఐడియల్ మూడవ స్థానంలో నిలిచిన వైష్ణవి  పాడుతుందని తెలిపారు. ఇలా తమన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్  సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని లీక్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: