బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలలో ఒకరు అయిన అక్షయ్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్షయ్ కుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం కూడా స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో  స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ ఈ మధ్య మాత్రం వరుస అపజయాలుతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు.  గద్దల కొండ గణేష్ మూవీ ని  హిందీలో బచ్చన్ పాండే గా రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సామ్రాట్ పృథ్వీరాజ్ తో కూడా అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయిన అక్షయ్ కుమార్ తాను నటించిన కొత్త సినిమాను  కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నాడు. అక్షయ్ కుమార్ తాజాగా రక్షాబంధన్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాను  ఆగస్ట్ 11 వ తేదీన విడుదల చేయబోతున్నారు.  సరిగ్గా ఇదే రోజు బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ హీరో గా  తెరకెక్కిన లాల్ సింగ్ చద్ద మూవీ కూడా విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం  విడుదల అయిన ప్రచార చిత్రాలకు,  ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అలాగే తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అపజయం తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఒక వేళ అమీర్ ఖాన్ నటించిన మూవీ కి గనుక పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే ఆ సినిమా భారీ కలెక్షన్లను కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.  అయినప్పటికీ అమీర్ ఖాన్ మూవీ తో అక్షయ్ కుమార్ పోటీపడబోతున్నాడు.  మరి ఈ బాక్స్ ఆఫీస్ పోరు లో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: