నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.  అయితే అనుకున్నట్లు గా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రాలేదనే చెప్పాలి. తొలిరోజున ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు తర్వాత రోజు నుంచి తగ్గుముఖం పట్టడంతో సినిమా విశ్లేషకులు ఈ చిత్రాన్ని ఫ్లాప్ గా నిర్ధారించారు. ఆ విధంగా ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం నాని అభిమానుల అందరికీ ఏమాత్రం నచ్చలేదు. దాంతో నాని మరొక హిట్ కొట్టవలసిన అవసరం ఏర్పడింది.

వాస్తవానికి చెప్పాలంటే గత కొన్ని సినిమాలుగా నాని తన అభిమానులను ఏ మాత్రం మెప్పించలేక పోతున్నాడు. వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిన నాని కథల ఎంపికలో ఎంతో స్పెషాలిటీ చూపించేవాడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ అవే కథల ఎంపిక విషయంలో ఆయన విఫలమవుతూ ఫ్లాప్ సినిమాలను ఎంచుకుంటూ అందరినీ నిరాశ పరుస్తున్నాడు. ఆ విధంగా నాని ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన అంటే సుందరానికి సినిమా కూడా ఫ్లాప్ అవడం ఇప్పుడు అభిమానులను మరింతగా నిరాశపరుస్తుంది.

అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా కొన్ని రికార్డులను సృష్టిస్తోంది. పెద్ద హీరోలకు సాధ్యం కానీ ఓవర్సీస్ రికార్డులను సృష్టించి నాని పేరిట లిఖించింది. అమెరికాలో ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేయడం అక్కడ నాని కి ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. సినిమా ఎక్కువ లెంతి గా ఉండడం పెద్ద మైనస్ కాగా తెలుగులో ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో బోర్ ఫీల్ అవుతున్నారు. దానికి తోడు కథ కూడా పేలవంగా ఉండటంతో నాని సెలక్షన్ రాంగ్ అని నిరూపించడం అయింది. మరి రాబోయే సినిమాలతో నాని విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: