టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి కంబ్యాక్ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత చేసిన రెడ్ సినిమాతోనూ సక్సెస్ ను కంటిన్యూ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. లింగు స్వామి లాంటి దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఒక విశేషం కాగా మరొక విcశేషం ఈ సిని మాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించడం.

ఈమె ఇప్పటివరకు నటించిన తెలుగు సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నటిస్తున్న ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. జూలై నెలలో ఈ సినిమా విడుదల కాబోతోండగా ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నాడు రామ్.  ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై పెరిగిన అంచనాల దృష్ట్యా ఈ సినిమాకు ఇం కా కొన్ని ఆకర్షణలు దిద్దె పని లో ఉన్నాడట. 

మరి అవి ఈ సినిమాకు ఏ స్థాయిలో ఉపయోగపడతాయో చూడాలి. వరుస సక్సెస్ లతో స్టార్ జోన్ లో ఉన్న రామ్ కు ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా మంచి క్రేజ్ పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆయన అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మాస్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం లో వరుసగా మాస్ దర్శకులతో సినిమాలు చేస్తున్న రామ్ ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: