కొంతమంది వారసులకు అసలు ఏమాత్రం కలిసి రాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలు ఒకటి రెండు సినిమాలతో నిలదొక్కుకుంటే వారసులు మాత్రం ఎంత మంచి సినిమాలు చేసిన హీరోలుగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా సినిమా పరిశ్రమలోకి చాలా రోజుల క్రితమే వచ్చినా దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఒక విజయం కోసం ఎంతగానో తపించి పోతున్నాడు ఆయన హీరోగా వచ్చిన సినిమాలన్నీ కూడా ఇప్పటివరకు డిజాస్టర్లుగా మిగలగా ఇప్పుడు చేస్తున్న చోర్ బజార్ సినిమాపైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు.

జార్జిరెడ్డి వంటి మంచి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 24వ తేదీన విడుదల కావడానికి సిద్దం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు చేయడంలో చిత్రబృందం నిమగ్నమై ఉంది. పెద్ద హీరోలు అందరూ కూడా తలో చెయ్యి వేసి ఈ సినిమాకు క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ మరియు రవితేజ వంటి వారు ఈ సినిమా యొక్క అప్డేట్ ల ను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కు కొన్ని అంచనాలు పెరగగా ఈసారైనా పూరి తనయుడు హిట్ కొడతాడా అన్న సందేహాలు సినిమా విశ్లేషకులలో నెలకొంటున్నాయి. తండ్రి సినిమాలలో ఉండే క్యారెక్టరైజేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆకాశ్ ఈ సినిమాలో కనిపిస్తున్న తీరును బట్టి తప్పకుండా ఇది మంచి విజయాన్ని అందుకుంటుందని తెలుస్తోంది. దానికి తోడు ఈ వారం వేరే పెద్ద సినిమా కూడా విడుదల కాకపోవడంతో ఈ సినిమా బాగుంటే తప్పకుండా మంచి కలెక్షన్లను సాధిస్తుందనీ భావిస్తున్నారు. మరి నటుడిగా మంచి ఇంప్రెషన్ కలిగి ఉన్న ఆకాష్సినిమా లో ఏ స్థాయి లో నటించాడో చూడాలి. దానికి తగ్గ కథ కూడా కుదిరితే ఈ హీరో హిట్ కొట్టడం గ్యారెంటీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: