నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. దాంతో నాని కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల పట్ల ఎంతో జాగ్రత్త వహించే అవసరం ఎంతైనా ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజ తర్వాత ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇంతటి స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు నాని.

ఈ నేపథ్యంలో తన స్వయం కృషి తో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన నాని ఇప్పుడు వరుస ఫ్లాప్ సినిమాలు చేయడం సరైన సక్సెస్ లేకపోవడం జరగడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. గత ఐదు సంవత్సరాలలో ఆయన నటించిన చిత్రంలలో శ్యామ్ సింగ రాయ్ చిత్రం తప్ప ఏ సినిమా కూడా పెద్దగా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. భారీ డిజాస్టర్ లు గా మిగిలాయి. తాజాగా వచ్చిన అంటే సుందరానికి సినిమా కూడా ఆ జాబితాలో కి చేరిపోవడంతో ఇప్పుడు ఆయనకు మరొక హిట్ రావలసిన అవసరం ఏర్పడింది.

సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కాక పోవడంతో ఇది ఆయన మార్కెట్ పై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మరింత పూర్ గా ఈ సినిమా పుంజుకునే అవకాశాలు కూడా కనిపించకపోవడం నాని క్రేజ్ ఏ స్థాయిలో దిగజారిందో అర్థం అవుతుంది. నాని నటించిన సినిమాల కథలు చాలా పూర్ గా ఉండడంతో ఆయనకు కూడా ఎఫెక్ట్ బాగానే తగిలింది అని చెప్పాలి. మరి ఆయన ఈ విధమైన ఫ్లాప్ లను ఎదుర్కోవడానికి ఓ బలమైన కారణం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథలను కాకుండా తన జోన్ దాటి కథలను ఎంచుకోవడం తోనే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: