ప్రముఖ దర్శకుడు టీ. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గోపీచంద్ తన కెరియర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. విలన్ గా మంచి సక్సెస్ సాధించిన ఈయన హీరోగా యూ టర్న్ తీసుకోవడంతో అక్కడినుంచి తన కెరియర్ పతనం వైపు అడుగులు వేసింది అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా పక్కా కమర్షియల్ సినిమాతో ఈసారి పక్కాగా విజయం సాధిస్తారని నమ్మకంతోనే గోపీచంద్ ఉన్నారు .ఇక భారీ బడ్జెట్ తో  గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడం గమనార్హం. ఇక ఇందులో రాశికన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లో ఒక భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే సినిమాకు గోపీచంద్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట గోపీచంద్. ఇక గోపీచంద్ హీరోగా తెరకెక్కిన జిల్ సినిమా తో దర్శకుడిగా krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆవరేజ్ రిజల్ట్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది . ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాకి కూడా krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా ఈ సినిమా కూడా డిజాస్టర్ పాలయింది.

వరుసగా రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగలగా.. ఇక krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ తో  సినిమా తీయడానికి యంగ్ హీరోలు కూడా భయపడుతున్నారు. అయితే krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ కు గోపీచంద్ అవకాశం ఇచ్చారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. కానీ గోపీచంద్ పై మాత్రం తన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలే గోపీచంద్ సినీ కెరియర్ ఒడిదుడుకులలో ఉండగా..  ఇప్పుడు మరొకసారి ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తే .. ఇక మళ్లీ ఆ సినిమా  ఫ్లాప్ అయితే ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవు అనేంతగా అభిమానులు ఆందోళన చెందుతూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: