టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ యాక్షన్ సినిమా దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో 'ది వారియర్' అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు ఇప్పటికే సుమారు 40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా వైజాగ్ ఏరియా హక్కులను స్వయంగా హీరో రామ్ పోతినేని సుమారు 4.5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసాడని టాక్ వినిపిస్తోంది. ఇక తన సినిమా రైట్స్ ని తానే కొనుగోలు చేయడంతో ఈ సినిమాపై ఇతర డిస్ట్రిబ్యూటర్స్ తోపాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. తన సినిమాను తానే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాడు అంటే ఈ సినిమాపై రామ్ ఎంత నమ్మకంతో ఉన్నాడని అర్థం అవుతోంది.

అగ్ర హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఇప్పుడు దారులు వెతుక్కుంటున్నారు.అలాటి మీడియం రేంజ్ హీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు రామ్ పోతినేని. ప్రస్తుతం ది వారియర్ తో తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇలా మెల్లమెల్లగా పాన్ ఇండియా మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాని రిలీజ్ అయిన బుల్లెట్ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి బుల్లెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇక ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

 జూలై 14న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలో మొదటిసారి ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో రామ్ కనిపిస్తుండగా.. విలన్గా ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. ఇక అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పందెంకోడి 2 ప్లాప్ తర్వాత లింగస్వామి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. అటు ఇష్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళి ఆ రేంజ్ మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్. మరి మన ఉస్తాద్ రామ్ కు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ను అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: