విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమా ఇటీవలే విడుదల అయి బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఈ విధంగా అయిపోవడం ఒక్కసారిగా ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరిచింది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ను తిప్పి తిప్పి చెప్పడంతో ఈ సినిమా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు దానికితోడు ఒకే లొకేషన్లో సినిమా మొత్తం జరగడం ఇంత పెద్ద హీరో ఉన్న సినిమాలో ట్విస్టులు లొకేషన్ లు లేకపోవడం వంటివి ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ముఖ్య కారణం.

అయితే విజయ్ దళపతి ఇప్పుడు చేయబోయే వంశీపైడిపల్లి సినిమా ద్వారా మళ్లీ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తూ ఉండగా విజయ్ దళపతి ఈ చిత్రం తర్వాత చేయబోయే లోకేష్ కనకరాజు సినిమాపై ఇప్పుడు బజ్ వస్తూ ఉండడం వంశీపైడిపల్లి సినిమా పట్ల కొంత టెన్షన్ కలిగిస్తుంది. తెలుగులో దర్శకుడిగా వంశీపైడిపల్లి కి భారీ చిత్రాలు చేసిన అనుభవం ఉంది ఆ చిత్రాలను సక్సెస్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద హీరోతో సినిమా చేస్తున్న వంశీ పైడిపల్లి సినిమాకు కాకుండా ఆ తర్వాత చేయబోయే సినిమాకు రావడం నిజంగా ఆ చిత్రం యొక్క యూనిట్ కు నిద్రలేని రాత్రులు మిగిలిస్తుందనే చెప్పాలి. 

మాస్టర్ సినిమా ను లోకేష్ తో కలిసి చేసిన విజయ్ దళపతి ఆ తర్వాత మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తమిళ వర్గాలు చెబుతున్నాయి ఇటీవలే విక్రమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు విజయ్ దళపతి తో సినిమా చేయడం మంచి విషయమే అయినా కూడా దానికంటే ముందు ఉన్న సినిమాను మరిచిపోయే విధంగా బజ్ రావడం నిజంగా విశేషం అనే చెప్పాలి. విక్రమ్ సినిమా విడుదల అయ్యి 20 రోజులు దాటుతున్న కూడా ఇంకా మంచి కలెక్షన్లు ఈ సినిమాకు వస్తూ ఉండటం విశేశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: