పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క టైటిల్ ను కూడా రివీల్ చేశారు. భవదీయుడు భగత్ సింగ్ అనే పేరుతో  రాబోతున్న ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడం ఒక్కసారిగా పవన్ అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది టు హరీష్ శంకర్ కి కూడా పవన్ వ్యవహార శైలి ఎంతో తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి భీమ్లా నాయక్ సినిమా కంటే ముందుగానే ఈ చిత్రం తెరకెక్కి విడుదల కావాల్సి ఉంది కానీ ఆ సినిమా మధ్యలోకి రావడం ఆ సినిమాను పవన్ కళ్యాణ్ చేసి విడుదల చేయడంతో ఈ సినిమా కాస్తా వాయిదా పడి పోయింది. ఎప్పటినుంచో ఈ సినిమా కాంబినేషన్ ప్రేక్షకుల ముందు ఊరిస్తూ ఉండగా ఇంకా ఈ సినిమా మొదలు కాకపోవడం వారిని ఎంతగానో చిరాకు పెట్టిస్తుంది. ఇంకొకవైపు ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో పవన్ కళ్యాణ్ డేట్లు అయిపోతాయోమానన్న టెన్షన్ కూడా చిత్రబృందం లో ఉంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్తమిళ సినిమా రీమేక్ గా ఈ చిత్రం కంటే ముందుగా చేయాలని భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి హరీష్ శంకర్ ఈసారి ఏ విధంగా రియాక్షన్ ఇస్తాడో చూడాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే విషయం పై ఆయన క్లారిటీ గా ఇచ్చారు. త్వరలోనే మా కాంబో లో సినిమా తెరపైకి రావడం ఖాయం అని అన్నారు . ఇలా అన్ని సెట్ అయ్యాయి అనుకున్న నేపథ్యంలో ఈ విధమైన వార్తలు రావడం దేనికి దారి తీస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజ హెగ్డే తప్పుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: