రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డుల విషయంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వసినిమాలో నటిస్తుండగా.. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కొరటాల శివసినిమా స్క్రిప్ట్ ను ఇంకా పూర్తి చేయలేదని ఈ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు ఆచార్య సినిమా నష్టాల భర్తీ కూడా పూర్తిస్థాయిలో జరగలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇతర అగ్రహీరోల స్థాయిలో ఎన్టీఆర్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ అ క్రమం తప్పకుండా ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైన 2023 సంవత్సరం లోనే ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అయితే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా పనులను ఆలస్యం చేస్తూ వస్తే మాత్రం ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని చెప్పొచ్చు.

సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకి సైతం ఇప్పటివరకు సమాధానం దొరకడం లేదు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేయడం కష్టంగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాల శివని సినిమా అప్డేట్స్ క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరడం హాట్టాపిక్ గా మారింది. మరి ఫాన్స్ డిమాండ్ కి కొరటాల శివ ఒప్పుకుంటాడా? లేదా అనేది చూడాలి.ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలి నేని సుధాకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: