పాన్ ఇండియా చిత్రాలగా ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` ఇంకా అలాగే `కేజీఎఫ్-2` సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాలగా నిలిచాయి.ఇక వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా నిలిచాయి. కానీ అంతిమంగా చూస్తే వసూళ్ల పరంగా `ఆర్ ఆర్ ఆర్` ని `కేజీఎఫ్-2` బీట్ చేసిందనేది వాస్తవం. రెండు చిత్రాల మధ్య వసూళ్ల పరంగా వ్యత్యాసం ఏకంగా 100 కోట్లుంది.ఆలెక్కలో రికార్డు పరంగా `కేజీఎఫ్-2` సినిమా బెస్ట్ అని చెప్పాలి. కానీ అంతర్జాతీయంగా  మాత్రం `ఆర్ ఆర్ ఆర్` కి దక్కిన గుర్తింపు కేజీఎఫ్ -2కి దక్కలేదు అన్నది అంతే వాస్తవం. గ్లోబల్ స్థాయిలో `ఆర్ ఆర్ ఆర్` సినిమాకి ప్రత్యేకమై గుర్తింపు దక్కింది. ఇక ఓవర్సీస్ లో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత యూఎస్ లో ఎన్కోర్ పేరుతో `ఆర్ ఆర్ ఆర్` సినిమా రీరిలీజ్ జరిగిన సంగతి తెలిసిందే.ప్రీమియర్ల రూపంలో ఈ సినిమా చక్కని వసూళ్లని సాధించింది. నాన్ ఇండియన్స్ తో థియేటర్లు బాగా కళకళలాడాయి. సినిమాని మెచ్చి ఎంతో మంది విదేశీయులు సోషల్ మీడియా వేదికగా టచ్ లో కి వచ్చారు. అలాగే రాటెన్ టోమాటోస్ లో రిజిస్టర్ అయిన తొలి సౌత్ సినిమాగా కూడా మరో అరుదైన ఘనత `ఆర్ ఆర్ ఆర్` సాధించింది. కేవలం హిందీ వెర్షన్ లో రిలీజ్ అయిన చిత్రానికే ఈ రేంజ్లో అప్లాజ్ అనేది దక్కింది.


ఇక ఇంగ్లీష్ వెర్షన్ కనుక రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ స్థానంలో `ఆర్ ఆర్ ఆర్` అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకునేది అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. సినిమా కంటెంట్ ఇంకా విజువల్ గా హైలైట్ అవ్వడం..గ్రాండియర్ లుక్ `ఆర్ ఆర్ ఆర్` సినిమాని ఆ స్థానంలో నిలబెట్టాయి అన్నది అంతే వాస్తవం. మిలియన్ ఫాలోవర్లు కలిగిన గేమ్ డిజైనర్ కొజిమా హిడియా సైతం ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందన తెలియచేయడం మరో విశేషంగా చెప్పొచ్చు. కానీ ఇలాంటి అప్రిసియేషన్స్ `కేజీఎఫ్-2` సినిమా విషయంలో ఎక్కడా చోటు చేసుకోలేదు.ఓటీటీలో రిలీజ్ అయినా కూడా `కేజీఎఫ్-2` కేవలం వీక్షణకే పరిమితమైంది తప్ప! సమ్ థింగ్ స్పెషల్ గా మాత్రం ఫోకస్ అవ్వలేదు. ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ కొన్ని రకాల ప్రమోషన్ స్ర్టాటజీని కూడా అప్లై చేసినప్పటికీ పనవ్వలేదు. కేవలం పాన్ ఇండియా వరకూ ఆ రీచ్ అనేది కుదిరింది. ఎలివేషన్ పరంగా `ఆర్ ఆర్ ఆర్` కన్నా కేజీఎఫ్-2 సినిమా ఉన్నతంగా ఉంటుంది. కానీ అవేవి విదేశీయుల్ని మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆ రకంగా `ఆర్ ఆర్ ఆర్` సినిమా ఎప్పటికీ ప్రత్యేకమనే చెప్పాలి. ఇక మహేష్ తో రాజమౌళి ఎంత అద్భుతంగా తీస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: