లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా విజయ్ సేతుపతిమూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఫహాద్ ఫాజిల్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  సూర్య ఈ మూవీ లో గెస్ట్ రోల్ లో నటించాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన భారీ ఎత్తున తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తోంది. చాలా కాలం నుండి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తున్న విక్రమ్ మూవీ 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల కలెక్షన్ల గ్రాస్ మార్క్ టచ్ చేసి అదిరిపోయే రికార్డ్ ను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ సినిమా ఏరియా వైజ్ గా సాధించిన కలెక్షన్ లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తమిళనాడు లో 153.90 కోట్లు . రెండు తెలుగు రాష్ట్రాలలో 26.25 కోట్లు .
కర్ణాటకలో 18.55 కోట్లు .
కేరళ లో  34.10 కోట్లు .
రెస్ట్ అఫ్ ఇండియా లో  8.70 కోట్లు .
ఓవర్ సీస్ లో  112.05 కోట్లు .
ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ సినిమా 16 రోజుల బాక్సాపీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి  176.20 కోట్ల షేర్ , 353.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: