కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ వరస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో మిగతా స్టార్స్ తో పోల్చుకుంటే విజయ్ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తున్నాడు. కరోనా కారణంగా మాత్రం 2020లో కొంత గ్యాప్ వచ్చింది. 2019లో బిగిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆ తర్వాత మాస్టర్ తో తన విజయపరంపరను కంటిన్యూ చేశారు. అయితే లేటెస్ట్ గా విడుదలైన బీస్ట్ సినిమా మాత్రం కాస్త నిరాశ పరిచింది. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. కానీ వసూళ్ళ పరంగా మాత్రం మరోసారి తలపతి రేంజ్ ఏంటో చూపించింది.

యావరేజ్ టాక్ తోనే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో విజయ్ తన 66వ చిత్రాన్ని ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కాగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్రయూనిట్. జూన్ 22 తలపతి విజయ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకొని తలపతి 66 ఫస్ట్ లుక్ జూన్ 21 సాయంత్రం 6: 01 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సడెన్ సర్ప్రైస్ అప్డేట్ మాత్రం తలపతి ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయన ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. తలపతి విజయ్ తో రష్మిక కు ఇదే మొదటి చిత్రం. ఇక ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి ప్రస్తుతం విజయ్ తో సినిమా చేయబోతుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా విజయ్సినిమా తర్వాత విక్రమ్ సినిమాతో హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 67వ సినిమా చేయబోతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: