ఫలక్ నామా దాస్ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశ్వక్ సేన్. ఇక ఆ తర్వాత పాగల్, హిట్ వంటి చిత్రంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. తాజాగా నటించిన అశోక వనంలో అర్జున్ కళ్యాణం చిత్రం ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నటుడిగా విశ్వక్ సేన్ ను ఒక మెట్టు పైకి ఎదిగేలా చేసింది. ప్రస్తుతం యువ హీరోలలో సరైన కథలు ఎంచుకుంటూ విజయం దిశగా దూసుకు పోతున్న హీరోలలో ఒకడు అని చెప్పవచ్చు.


కన్నడలో స్టార్ మరియు టాలీవుడ్ లో సుదీర్ఘకాలంగా బాగా పరిచయం ఉన్న హీరో అర్జున్ సర్జా రచయితగా, నిర్మాతగా , డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సినిమాలో విశ్వక్ సేన్ నటించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన అర్జున్ కూతురు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. విశ్వక్సేన్ అర్జున్ ది చాలా ఆసక్తికరమైన కాంబినేషన్. ఫలక్నామా దాస్ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు విశ్వ క్. ప్రస్తుతం తన దర్శకత్వంలో వస్తున్న చిత్రం దాస్ కా దమ్కి తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే అర్జున్ తో కలిసి ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.అర్జున్ హాంబలే వారు ఈ సినిమాని నిర్మించడం జరుగుతోంది. ఈ సినిమాతో తన కుమార్తె ఐశ్వర్యను కూడా అర్జున్ తెలుగులో కథానాయిక గా పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికీ కన్నడంలో కూడా సత్తా చాటుతున్న ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాలో కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక సీనియర్ నటుడు జగపతిబాబు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇది రోడ్ సైడ్ చిత్రం గా ఉన్నది. విశ్వక్సేన్ అర్జున్ విలక్షణమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: