ఈ మధ్య కాలంలో చాలా మంది ఈటీవీ నుంచి వేరే చానెల్ కు వెళుతున్నారు..అమ్మోరు, అరుంధతి వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్... అంజి మూవీ అనుభవం కారణంగా బుల్లితెర వైపు మళ్లారు.తక్కువ బడ్జెట్ తో సీరియల్స్, రియాలిటీ షోస్ నిర్మాణంలోకి దిగారు. మల్లెమాల నిర్మాణంలో వచ్చిన క్యాష్, ఢీ, జబర్దస్త్ సంచలనాలు నమోదు చేశాయి. సుదీర్ఘ కాలం టాప్ రేటింగ్ సాధించిన షోలుగా నిలిచాయి..ఇవే కాదు ఇంకా ఎన్నో షోలను కూడా చేశారు..


సక్సెస్ వెనుక యాంకర్స్,కమెడియన్స్ పాత్ర చాలా ఉంది. మల్లెమాలకు భారీ లాభాలు కురిపించిన ఈ షోలు ఏడాది కాలంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఆ షోస్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న యాంకర్స్, కమెడియన్స్ నిష్క్రమించడమే దీనికి కారణం. ముఖ్యంగా ఢీ, జబర్దస్త్ షోస్ పూర్తిగా కళ కోల్పోయాయి..జబర్దస్త్ నుండి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను వెళ్లిపోయారు. అలాగే ఢీ రియాలిటీ షోలో యాంకర్ రష్మీ,సుధీర్, దీపికా పిల్లి ప్రస్తుతం లేరు. వీరి నేతృత్వంలో ఢీ 13 భారీ సక్సెస్ సాధించింది. ఢీ 14 నుండి జడ్జి పూర్ణ, రష్మీ, సుధీర్, దీపికా పిల్లిని తొలగించారు. వాళ్ళ నిష్క్రమణతో షోలో గ్లామర్ యాంగిల్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తగ్గింది.


సుధీర్ అయితే కొన్ని కారణాల ఈటీవీకి దూరం అయ్యాడు..ఏళ్ల తరబడి మల్లెమాలతో జర్నీ చేసిన ఈ కమెడియన్స్, యాంకర్స్ ఒక్కసారిగా ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కావడం లేదు. 2019లో జబర్దస్త్ ను వీడిన నాగబాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మల్లెమాల వాళ్ళు రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తారని, కనీసం భోజన సదుపాయాలు కల్పించరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..నాగబాబు ఆరోపణల తర్వాత కొంత మంది మినహాయిస్తే ఎవరూ మల్లెమాలను వీడలేదు. ఏడాది కాలంలోనే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కారణాలు ఏమైనా కానీ ప్రేక్షకులు తాము కోరుకున్న ఎంటర్టైన్మెంట్ కోల్పోతున్నారు. ప్రదీప్ ఢీ షోని వీడితే టీఆర్పీ పరంగా చాలా కష్టం..ఇక నెక్స్ట్ ఎవరూ వెలతారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: