బ్రాండ్ బేబీగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ దిశా పటానీకి, మాంచి ఫోటోగ్రఫీ టేస్టు కూడా వుంది.. కుర్రోళ్లకు తన అందాలతో గాలమేస్తూ, ఓ రేంజ్‌లో తన ఫాలోయింగ్ సంపాదించుకుంది.


తెలుగులో 'లోఫర్' సినిమాతో పరిచయమైంది. కానీ, సినిమా రిజల్ట్ తేడా కొట్టేసరికి ఫస్ట్ సినిమాకే తాను అవుట్ అయిపోయింది.



తర్వాత అంతా సోషల్ మీడియా హవానే సాగింది.ఎలాగైనా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడానికి తపన పడింది. దిశా పటానీ అందులో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు. కెరీర్‌లో మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు వెళ్లిపోతోందట.



బాలీవుడ్‌ నుండి మళ్లీ టాలీవుడ్‌కి ఇలా..

బాలీవుడ్‌లో మొదట అంతంత మాత్రంగానే దిశా పటానీ కెరీర్ నడిచిందట.. అయినా, కానీ, కుంగిపోలేదు. నిలదొక్కుకుంది. అనుకున్నది సాధించింది. ఓ పక్క సినిమాలూ, ఇంకో పక్క స్పెషల్ ఫోటో షూట్లూ.. అబ్బో దిశా పటానీ కెరీర్ కెక్కే కిక్కు. తాజాగా నెట్టింట్లో దిశా పటానీ ఫోటోలు కొన్ని స్పెషల్‌గా తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా బికినీతోనే కిక్కిచ్చే దిశా ఈ సారి ఓ డిఫరెంట్ అవుట్ ఫిట్‌తో రెచ్చిపోయి కనిపించిందట.


అదలా వుంటే, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సంద డి చేసేందుకు దిశా పటానీ రెడీ అవుతోందని సమాచారం. ప్రబాస్ సరస న 'ప్రాజెక్ట్ కె' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైద్రాబాద్‌కొచ్చిన దిశా పటా నీ, తనకు హైద్రాబాద్ అంటే ఎంతో ఇష్టమనీ పేర్కొందట. అలాగే మంచి అవకాశాలొస్తే, తెలుగు సినిమాల్లో నటించేందుకు రెడీ అని కూడా క్లారిటీ ఇచ్చింది.


హా.! ఎందుకు నటించదు. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుంది కదా.. అంటూ ఆ విషయంలో దిశా పటానీని తెలుగు నెటిజన్లు కాస్త ట్రోల్ చేసినా కానీ, ముంబయ్ భామలకు ఆ మాత్రం క్రేజ్ వుంటుందిగా మరి. ఒప్పుకు ని తీరాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: