గత కొన్ని సంవత్సరాల క్రితం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా చిత్రం చూసిన వాళ్ళు అందులో ఉండే పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఫిదా సినిమాలో తండ్రీ కూతుర్ల అనుబంధం మనసులను ఆకట్టుకునేలా ఉంటుంది. వివాహం పేరుతో తల్లికి దూరంగా ఉండడం ఇష్టంలేని ఒక ఆడపిల్ల కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం కూడా తెలంగాణ ప్రాంతంలోని ప్రేమానురాగాలకు అనుగుణంగా చిత్రీకరించడం జరిగింది ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి చంద్ నటించారు. ఇక తాజాగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా సాయి పల్లవి తండ్రి గానే నటించారు.


నిన్నటి రోజున ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సాయి చంద్ మాట్లాడుతూ.. సినిమాలో సాయి పల్లవి కి మాత్రమే తండ్రి గా నటించడానికి తాను ఎక్కువగా ఇష్టపడతానని తెలియజేశారు. ఫిదా చిత్రంలో నటించడానికి ముఖ్యకారణం సాయి పల్లవే అని తెలియజేశారు నిజంగానే నా కూతురిగా  అనిపించడం వల్ల అలా కలిసి నటించానని తెలిపారు. అందుచేతనే అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య తండ్రి కూతుర్ల బంధం అలాగే కొనసాగడం వల్లే విరాటపర్వం సినిమాల్లో కూడా ఆమెకు తండ్రి పాత్ర చేయడానికి ఒప్పుకున్నానని తెలిపారు.


సాయి పల్లవి కి తనకు విడదీయరాని బంధం ఉందని తను పుట్టినప్పుడు నేను సినిమాలు చేయడం ఆపి.. ఆ తర్వాత ఆమె నటించే ఫిదా చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. ఏదో ఒక కారణం లేకపోతే ఇలా జరగదు కదా అనిపిస్తూ ఉంటుంది అని సాయి చంద్ తెలిపారు. సాయి పల్లవి కి కాకుండా ఎవరికైనా నటించాలంటే కాస్త ఆలోచన చేస్తాను. అలా వచ్చిన ఆఫర్ల లో ఉప్పెన చిత్రంలో వైష్ణవి తేజ్ కి తండ్రి గా నటించమని చిరంజీవి గారు అడిగారు అందుకు నేను ఆలోచించాను అని తెలిపారు. నిజ జీవితంలో ఒక తండ్రి ఎమోషనల్ ఎలా ఉంటుంది అనే విషయం తనకు తెలియదు ఎందుకంటే తను వివాహం చేసుకోలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: