సైన్యంలోని నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకం..అగ్నిపథ్ . ఈ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. స్వల్పకాలిక నియమాలపై ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఆందోళన పై ప్రముఖ బాలీవుడ్ నటి అయిన కంగనా రనౌత్ స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి పథకానికి మద్దతు కూడా తెలిపింది. అందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లో ఒక స్టేట్మెంట్ ను కూడా ఇవ్వడం జరిగింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం


ప్రపంచంలో అన్ని దేశాలలో ఇప్పుడు ఇది అమలు అవుతుందని ఇజ్రాయెల్ వంటి దేశాలలో కూడా యువత ఎక్కువగా సైన్యంలో శిక్షణ తీసుకొని ఆయా దేశాలకు సేవలు చేస్తున్నాయని కంగనా తెలియజేసింది. యువత ఎక్కువగా ఆర్మీలో పనిచేయడం ద్వారా వారి జీవితంలో ఎలాంటి విలువలు జీవించాలో తెలుసుకుంటారని.. అంతేకాకుండా క్రమశిక్షణ జాతి మత భావం అనేది దేశ సరిహద్దులలో దేశాన్ని రక్షించడం ఎలాగో వారు తెలుసుకుంటారని ఆమె తెలియజేసింది. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీము కూడా ఇందులో ఛానల్ లోతైన అర్ధం ఉందని తెలియజేసింది. ఇ స్కీమ్ వల్ల ఏదో డబ్బు సంపాదించుకోవడనికో.. భవిష్యత్తు నిర్మించుకోవడానికో, ఉపాధి కల్పనకో కాదని కంగనా రనౌత్ తెలియజేసింది.అప్పటి రోజులలో ప్రతి ఒక్కరు కూడా విలువిద్యలు నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్లేవారు.. ఈ అగ్నిపథ్ పథకం కూడా అలాంటిదే అని తన పోస్టు ద్వారా తెలియజేసింది. డ్రగ్స్ పబ్జి లాంటి వాటిని బానిసగా మారిన జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతకు వాటి బారిన పడకుండా..ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది అని తెలియజేసింది. ఇక ఇటీవల కాలంలో సంస్కరణలు ఖచ్చితంగా అవసరమేనని ఈమె అభిప్రాయంగా తెలియజేసింది.అగ్నిపథ్ వంటి స్కీములను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి తన అభినందనలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసింది దీంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: