రకుల్ ప్రీత్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమా తోనే మంచి మార్కులు వేయించుకుంది. ఆ సినిమా తర్వాత వరుస సినిమా ఛాన్స్ లు రావడంతో అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది.ఒక వైపు సినిమాలు , మరో వైపు వాణిజ్య ప్రకటనల తో దూసుకుపోతుంధి.. హిట్ సినిమాల తో పని లేకుండా సినిమాలను చేసుకుంటు వస్తుంది..తెలుగులో వరుసగా సినిమాలు చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది..


అక్కడ కూడా పెద్దగా పేరును తెచ్చుకోలేక పోయింది..అయిన వదలకుండా సినిమాలు చేస్తుంది. వీటితో పాటు జిమ్ లో బాగా కష్ట పడుతూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అమ్మడు చేసిన భారీ కసరత్తుల వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ వాటికి వచ్చే కామెంట్లను ఎంజాయ్ చేస్తుంది.. ఇప్పటికే రకుల్ చేతిలో దాదాపు అరడజను బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ కూడా ఎవరో చెప్పేసింది రకుల్.


తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన ఫేవరేట్ ఫుడ్ గురించి మాట్లాడింది. రకుల్ మాట్లాడుతూ.. ”ఆహారంలో నాకు కచ్చితమైన నియమాలేవీ లేవు. నచ్చిన ఆహారం కడుపునిండా తింటాను. జ్యూస్‌ కంటే కూడా నేను పండ్లు తినడానికే ఆసక్తి చూపిస్తాను. అలా అయితేనే వాటిలోని పోషకాలు మనకు పూర్తిగా అందుతాయి. అలాగే గుజరాతీ థాలీ, గులాబ్‌ జామూన్‌, ఆలూ పరాటా చాలా ఇష్టంగా తింటాను, రెస్టారెంట్లు, స్టార్‌ హోటల్స్‌.. ఇలా బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో భోజనమే నాకిష్టం” అని తెలిపింది...ఇక సినిమాల విషయానికొస్తే అమ్మడు బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉంది. అందులో ఎ ఒక్క సినిమా అయినా హిట్ అయితే అమ్మడుకు అవకాశాలు వస్తాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: