తెలుగు చిత్ర పరిశ్రమ విచిత్రమైన ఫేజ్ లోకి ప్రవేశించింది అని చెప్పవచ్చు.  ప్రేక్షకుల మైండ్ సెట్ ఆధారంగా 70,  80 లలో క్లాసిక్ కంటెంట్ తో మెప్పించిన తెలుగు చిత్ర సినిమా, 90లలో మాసీ కమర్షియల్ హంగులు కోసం పాకులాడుతూ ఉండడం గమనార్హం. ఇక అదే క్రమంలో గ్లామర్ కంటెంట్  శృతిమించిందని విమర్శలు కూడా వచ్చాయి. ఇక 2000 వ సంవత్సరం వరకు కూడా ఇదే సన్నివేశం కొనసాగింది .కాలక్రమేణా ఇన్స్టిట్యూట్ నుంచి ఫిల్మ్మేకర్స్ పెరిగిన క్రమంలో బడ్జెట్ కూడా మారిపోయింది. అగ్ర దర్శకుల అసిస్టెంట్లు చేయలేని ప్రయోగాలను కొత్త కుర్రాళ్ళు కూడా చేయగలిగారు. ఇక ఈ నవతరం హీరోలు కూడా ప్రయోగాత్మక కంటెంట్ తో ఎదగడానికి సరికొత్త అవకాశం కూడా తెరవబడింది. ఇక బాహుబలి సినిమా ఘన విజయం సాధించిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా మొదలైంది అని చెప్పవచ్చు.

ఇకపోతే తాజాగా మారిన ట్రెండ్ లో కేవలం తెలుగు ఆడియన్స్ వరకే పరిమితమైతే కుదరదు. కాబట్టి తమిళ్, హిందీ ప్రేక్షకులకి కూడా రీచ్ అయ్యేందుకు హీరోలు తపించాల్సిన సందర్భం వచ్చింది. తెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇరుగు పొరుగు భాషల్లో కూడా తెలుగు సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. విచిత్రం ఏమిటంటే ఇతర భాషా సినీ ఇండస్ట్రీ లో తెలుగు సినిమా కి ఉన్న ప్రాముఖ్యత హిందీ సినిమాకు లేకపోవడం చాలా విడ్డూరం అని చెప్పవచ్చు. ఇక ఇందుకు కారణం మన తెలుగు హీరోల్లో బాధ్యత పెరిగింది . తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా తీసుకొని వెళ్ళాలి అంటే ఆలోచనలు కూడా ఉన్నంతగా తీసుకోవాల్సి ఉంటుంది.

అగ్ర నిర్మాతలు కూడా కుర్ర హీరోలకు అండగా నిలుస్తూ.. ఎంతో పకడ్బందీ వ్యూహంతో కంటెంట్ పరంగా.. బడ్జెట్  పరంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. టాలీవుడ్లో ఇప్పుడున్న క్రేజ్ ను  క్యాష్ చేసుకోవడానికి వైవిధ్యమైన యూనివర్సల్ అప్పీల్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ తో మెప్పిస్తే భాషతో పని లేకుండా ఎక్కడైనా రాజ్యమేల వచ్చని నిరూపణ అవుతుంది. కాబట్టి కుర్ర హీరోలు కూడా ఈ కొత్త ఛాలెంజ్ ను స్వీకరించక తప్పదు

మరింత సమాచారం తెలుసుకోండి: