మొదటిసారిగా కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చాందిని చౌదరి చిన్నతరహా సినిమాలతో చాలా బిజీగా ఉన్నది. ఇక ఆమె నటించిన తదుపరి చిత్రం సమ్మతమే కూడా మరికొన్ని రోజులలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒక ప్రశ్న ఎదురవ్వడం జరిగిందట. ఒకవిధంగా ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక విసుగెత్తిపోయినట్లు తెలుస్తోంది ఇంతకు ఆ ప్రశ్న ఏమిటి ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో నార్త్ హీరోయిన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే తెలుగు అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా ఇక్కడ అవకాశాలు రావు మీరు అనుకున్నట్లుగా ఇక్కడ ఆదరణ లభిస్తోందా అనే ప్రశ్న ఈమెకు ఎదురైందట. ఈ ప్రశ్న ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా ఆమెకు ఎదురైనట్లు తెలియజేసింది అయితే చాందిని ఇటీవల సమ్మతమే సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలో ఇ ప్రశ్న అడగడంతో ఆమె విసిగిపోయి సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్న నేను చాలా రోజులుగా ఎదుర్కొంటున్నాను మీరు ఎందుకు ఈ తరహా ప్రశ్నలు దర్శకులను అలాగే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే వారిని అడగరు అని తెలియజేసింది.


అంతేకాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో నార్త్ ఇండస్ట్రీ అమ్మాయిల కి ఎందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి అనే విషయం గురించి పెద్దగా ఆలోచించను అని తెలిపింది. వాళ్లకు ఎలా అవకాశాలు వస్తాయనే విషయం నాకు అనవసరం ఆ విషయంపై నేను ఎలాంటి కామెంట్ చేయను అని తెలియజేసింది. కానీ తెలుగు అమ్మాయిలకు మాత్రం ఇక్కడ పెద్దగా ఆఫర్లు రావడం లేదనే విషయంలో నేను కూడా అప్డేట్ అవుతున్నాను అని చాందిని సున్నితంగా సమాధానం తెలిపింది. ఇక ఈమె తెలిపిన సమాధానం కరెక్ట్ అని మరికొంత మంది నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. నిజంగానే తెలుగు హీరోయిన్ లకు ఎందుకు అవకాశాలు ఇవ్వరనే విషయన్ని డైరెక్టర్లను, నిర్మాతలు ఎవరూ అడగలేదని మరికొంత మంది నెటిజన్లు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: