నాగ చైతన్య హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ముందుగా థాంక్యూ చిత్రం విడుదల కాబోతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేసిన నాగ చైతన్య తప్పకుండా ఈ చిత్రంతో విజయాన్ని అందుకుంటానన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ కు ప్రత్యేక శైలి ఉంది. మొదటి సినిమా నుంచి ఆయన చిత్రాలు విభిన్నమైన కథా కథనాలను కలిగి ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం కూడా వెరైటీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అందరూ కూడా భావిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మనం సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. జూలై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కూడా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడం లేదని అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఏడాది లవ్ స్టోరీ చిత్రంతో ఘన విజయం అందుకున్న నాగచైతన్య ఈ యేడాది ఆరంభంలో బంగార్రాజు చిత్రంతో వరుసగా రెండు బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నారు. అదే సక్సెస్ జోరు ను ఈ చిత్రంతో కంటిన్యూ చేయాలని వారు భావిస్తున్నాడు చైతు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం మరింత విజయం అందుకోవాలంటే తప్పకుండా భారీస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బృందం చిత్రంలోని అప్ డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై క్రేజ్ ను పెంచే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరింత క్రేజ్ రావాలంటే వారు ఏ రకమైన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: