పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ త్వరలోనే మళ్ళీ మొదలు కాబోతుంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించి మధ్యలో వేరే సినిమా షూటింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. ఇటీవలే దర్శక నిర్మాతలు కలిసి పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా యొక్క షూటింగ్ గురించి చర్చించారు.

జూలై నెల నుంచి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనేది ఆలోచన. మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఈ సినిమా పూర్తవ్వడానకి సహకరిస్తారో చూడాలి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మధ్యలో కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది అనే వార్తలు వినిపించాయి కానీ అవి నిజం కాదని ఈ వార్తతో తేలిపోయింది.

నిధి అగర్వాల్ మరియు జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఈ స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు ఇలాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గతం లో నటించలేదు. అందుకే ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల లిస్టు బాగానే ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేస్తున్న పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ సినిమా కూడా చేయబోతున్నాడని అంటున్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయవలసి ఉంది పవన్ కళ్యాణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: